మారి సెల్వరాజ్ మినహాయించి కోలీవుడ్ స్టార్ దర్శకులంతా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న వేళ తమిళ ఆడియన్స్‌కు ఉన్న ఒక ఒక్క హోప్ నెల్సన్ దిలీప్ కుమార్. అతడే మళ్లీ తమిళ ఇండస్ట్రీని నిలబెడతారని ఆశిస్తున్నారు. కానీ ఈ కమర్షియల్ డైరెక్టర్ టాలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నాడన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. నెల్సన్ ప్రజెంట్ జైలర్2తో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఎవరితో చేయబోతున్నాడన్న క్యూరియస్ నెలకొంది. మళ్లీ రజనీనే డీల్ చేసే ఛాన్సుందని వార్తలొచ్చాయి. కానీ ఇదే టైంలో టాలీవుడ్ యంగ్ హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
Also Read : Star Brothers : టాలీవుడ్ మార్కెట్‌పై కోలీవుడ్ బ్రదర్స్ స్ట్రాంగ్ ఫోకస్
ఇప్పటి వరకు ప్లాప్ చూడని నెల్సన్ దిలీప్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్‌తో వర్క్ చేయబోతున్నాడన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న బజ్. కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ షూటింగ్ నెక్ట్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉన్న కమిట్మెంట్ వల్ల నెల్సన్ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో లోకేశ్ కనగరాజ్ నుండి చేజారిన రజనీ, కమల్ మల్టీస్టారర్ ఫిల్మ్ నెల్సన్ చేతికి వచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నెల్సన్ నెక్ట్స్ మల్టీస్టారర్లనే డీల్ చేస్తున్నాడన్నది మొన్నటి వరకు ఓ వార్త చక్కర్లు కొట్టింది. కానీ సడెన్లీ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది మరో టాలీవుడ్ హీరో నేమ్. ఇటు తారక్.. అటు మల్టీస్టారర్ కన్నా ముందే టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌తో నెల్సన్ వర్క్ చేయబోతున్నాడన్న రూమర్ గట్టిగానే వినిపిస్తుంది. ఈ దర్శకుడిపై రోజుకొక రూమర్ వస్తున్నా కూడా కోలివుడ్ కి డ్రీమ్ గా మిగిలిన వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాను నెల్సన్ అందిస్తాడని హోప్స్ పెట్టుకుంటున్నారు తమిళ తంబీలు.
