“ఆర్ఆర్ఆర్” షూటింగ్ రీస్టార్ట్ అయ్యేది అప్పుడే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ వ్యాప్తి తగ్గుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో నెమ్మదిగా మల్లి అన్ని కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ కూడా ఒళ్ళు విరుచుకుంటోంది. ఇప్పటికే నితిన్ “మాస్ట్రో” టీం తన షూటింగ్ ను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ప్రారంభం కాబోతోందట. జూలై 1 నుంచి “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను రీస్టార్ట్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పటివరకు ఈ సినిమా 70 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మిగతా భాగం షూటింగ్ ను పూర్తి చేయడానికి జక్కన్న సిద్ధమవుతున్నాడు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ పలుమార్లు ఆగిపోవడంతో అనుకున్న టైంకు సినిమా పూర్తి కావడం కష్టమని, అక్టోబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రాయడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ తదితర ప్రముఖులు నటిస్తున్న “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!