Rowdy Janardhana : రౌడీ కోసం ‘కన్నప్ప’ బ్యూటీ

Rowdy Janardhan

Rowdy Janardhan

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రవి కిరణ్ కోలా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రౌడీ జనార్ధన’. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం ‘కన్నప్ప’ చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరిపిందని, దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఒకవేళ ఖరారైతే, ఇది క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. కాగా, ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని, విజయ్ దేవరకొండ మేనరిజమ్స్, రవి కిరణ్ మార్క్ టేకింగ్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని టీమ్ గట్టి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మరి రౌడీ జనర్థాన ఎలా ఉంటుందో చూడాలి.