టాలీవుడ్‌లో స్టార్ హీరోల పాపులారిటీ పెరుగుతున్న వేళా, యంగ్ హీరోలకు కష్టకాలం మొదలైంది. మరి ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇలాంటి సతమతంలో ఉన్నారు.. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్. 2021 లో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన లుక్, నటన తో మార్కులు కొట్టేశాడు. అయితే ఆ తర్వాత మూడు సంవత్సరాలుగా ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనతో జత కట్టిన శ్రీ లీల కెరీర్ మాత్రం రాకెట్‌లా దూసుకుపోతోంది.
Also Read : Nagavamsi : తెలిసి కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నా..
అయితే ప్రజంట్ రోషన్ ‘ఛాంపియన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా, ఇది ‘సేవ్ ది టైగర్స్’ వంటి హిట్ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని ‘స్వప్న సినిమా’, ‘ఆనంది ఆర్ట్స్’ కలిసి నిర్మిస్తున్నాయి. కానీ ఇది తప్పించి ప్రస్తుతం రోషన్ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, గత ఏడాది నుంచి శ్రీకాంత్ రోషన్ కోసం వచ్చిన దాదాపు 50 స్క్రిప్టులను తిరస్కరించాడట. ఈ చర్య ద్వారా శ్రీకాంత్ తన కొడుకు కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడో తెలుస్తోంది. కానీ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి వేగంగా సినిమాలు చేస్తూ, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. లేదంటే, మంచి లుక్స్, యాక్టింగ్ టాలెంట్ ఉన్నా సరే, స్పీడ్ లేకపోతే అవకాశాలు ఇతరుల చేతిలోకి వెళ్లిపోతాయి. మొత్తంగా చెప్పాలంటే, శ్రీకాంత్ అతి జాగ్రత్త, రోషన్ కెరీర్ స్పీడును తగ్గిస్తోంది అనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ‘ఛాంపియన్’ సినిమా ఆయనకు తిరుగులేని బ్రేక్ ఇస్తుందా? అనేది చూడాల్సిందే.