యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా వేసిన హిలేరియస్ పంచులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. “రొమాంటిక్” డేట్ విత్ ప్రభాస్ అంటూ యంగ్ హీరోహీరోయిన్లు ఆకాష్ పూరీ, కేతిక శర్మ చేసిన సందడి నెటిజన్లు విశేషంగా అలరిస్తోంది. ఈ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఇటీవల లాంచ్ చేసిన ప్రభాస్ అనంతరం ఆ చిత్ర హీరో, హీరోయిన్, ఆకాష్ పూరి, కేతిక శర్మలతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసాడు. ఈ వీడియోలో గతంలో ఎన్నడూ లేనంతగా ఓపెన్ అయ్యి అందరికీ షాకిచ్చాడు ప్రభాస్. కేతిక తనను తాను పరిచయం చేసుకుంటూ “హాయ్ సార్, నేను ఢిల్లీ నుంచి కేతికను” అని చెప్పగా, “హాయ్ మేడమ్, నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్” అంటూ ప్రభాస్ బదులిచ్చాడు.
Read Also : మెగా అప్డేట్ : “భోళా శంకర్” ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఇక హీరోయిన్ ను పాట పాడమంటూ ఆకాష్ అడగ్గా, కేతిక సిగ్గు పడిపోతూ తాను కేవలం బాత్రూం సింగర్ అంటూ దాటవేసే ప్రయత్నం చేసింది. అయితే ఆకాష్ మాత్రం వదలకుండా ఇది బాత్రూం అనుకో, నేను, ప్రభాస్ అన్న ఇక్కడ లేము అనుకో… ఏమంటావ్ ప్రభాస్ అన్న… అనగానే ఆమె బాత్రూంలో నేను ఎందుకు ఉంటారా ? అంటూ హిలేరియస్ పంచ్ వేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక ‘రొమాంటిక్’ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంటూ ప్రభాస్ ఈ ఇంటర్వ్యూ ను ముగించారు. అనిల్ పాదూరి అనే నూతన దర్శకుడు ‘రొమాంటిక్’ చిత్రంతో పరిచయం కాబోతున్నాడు. సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 29న విడుదల చేయనున్నారు.