కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్‌ను ఖరారు చేయడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ కు కలిసి రాని వాలెంటైన్స్ డే.. ఏమైందంటే
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ టీజర్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ శుక్రవారం అనగా ఫిబ్రవరి 20, 2026 ఉదయం 9:35 గంటలకు ‘టాక్సిక్’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, టీజర్ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో ‘యష్ 19’ ట్రెండింగ్ మొదలైంది. ఈ చిత్రంలో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార నటిస్తుండగా ఈ ఏడాది మార్చి 19, 2026న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఉగాది కానుకగా వస్తున్న టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
