రిషబ్ శెట్టి దర్శకత్వం ‘కాంతార ఛాప్టర్-1’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘హోంబాలే ఫిల్మ్స్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో రిలీజై సంచలన విజయం సాధించిన ‘కాంతార’ కు ప్రీక్వెల్‌గా దీనిని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ని నిర్మిస్తుండగా ఈ క్రేజీ ప్రీక్వెల్ పై.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి.
Also Read : Sonu Sood : తెలుగు వారితో నాకు మంచి అనుబంధం ఉంది..
గతంలో ‘కాంతారా’ మూవీ టీమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్ని రోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత గాలి వానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ ధ్వంసమైంది. ఇప్పుడు తాజాగా ఇదే షూటింగ్‌లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ విషాదకరంగా మరణించాడు. ఇది ఎలా జరిగింది అంటే ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్ సమయంలో, ఈ మూవీ కోసం పనిచేస్తున్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరులో ఈ ఘటన జరిగింది. షూటింగ్ పూర్తయిన తర్వాత, కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లారు. నీటి లోతు తెలియకనే వారు నదిలోకి దిగారట. దీంతో అతను నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.