దర్శకుడు సందీప్ సింగ్ ఒక హిస్టారికల్ డ్రామా “ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: ఛత్రపతి శివాజీ మహారాజ్”కి తెర లేపారు. ఈ సినిమాలో శివాజీ పాత్రలో కాంతార హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది, ఇందులో శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టిని చూడటానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రిషబ్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఈ చిత్రం 2027 జనవరి 21 న థియేటర్లలో విడుదల అవుతుందని రిషబ్ తెలిపారు.
Airtel Black Offer: రీఛార్జ్ ఒక్కటే.. ప్రయోజనాలు ఎన్నో
రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ వన్’ తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో కూడా రిషబ్ శెట్టి కనిపించబోతున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి ఎలా నటిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన మేరీ కోమ్, అమితాబ్ బచ్చన్-నటించిన ఝుండ్ వంటి పలు ప్రశంసలు పొందిన చిత్రాలను నిర్మించిన సందీప్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు . ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాతో సందీప్ సింగ్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు.