పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత కాలంలో పవన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఆ తదనంతర పరిస్థితులలో పవన్ నుంచి దూరమైనా, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. అయితే, నటనకు గ్యాప్ ఇచ్చిన ఆమె, చాలా కాలం తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం మళ్ళీ మేకప్ వేసుకుంది. అయితే, ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు.
Also Read : Sukumar : మరో ఇద్దరు శిష్యులను డైరెక్టర్లను చేస్తున్న సుక్కూ
ఇప్పుడు మరోసారి ఆమె ఒక పాత్ర ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక కామెడీ ఫిలింలో ఆమె హీరోయిన్ అంత పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా ఒప్పుకోవడానికి కథే కారణం అని తెలుస్తోంది. కథతో పాటు ఈ సినిమాలో ఉన్న ఆమె పాత్రకు మంచి వాల్యూస్ ఉండడంతో ఆమె ఈ సినిమా ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలోనే రేబిస్ ఇంజక్షన్ తీసుకుని రేణు దేశాయ్ వార్తల్లోకి ఎక్కారు. ఇక ఇప్పుడు ఆమె కామెడీ సినిమా ఒప్పుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కినట్లు అయింది. ఇక ప్రస్తుతానికి రేణు దేశాయ్ సోషల్ వర్క్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎక్కువగా సోషల్ మీడియాకే సమయం వెచ్చిస్తూ, తద్వారా తాను చేయాలనుకున్న సమాజ సేవ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.