హాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మరోసారి తన విజువల్ మాయాజాలంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అవతార్ ఫ్రాంఛైజీలో మూడో భాగం అవతార్ ‘ఫైర్ అండ్ యాష్’ ట్రైలర్‌ను చాలా రోజుల కిందట రిలీజ్ చేశారు. సినిమా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ట్రైలర్ వచ్చాక ఈ సినిమాకి ఉన్న హైప్ కాస్త తగ్గిందట. జేమ్స్ కామెరూన్ అద్భుత ఆవిష్కరణ ‘అవతార్’ మొత్తం ఐదు భాగాలతో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన రెండు భాగాలు అత్యధిక ప్రేక్షదారణ పొందాయి. అవతార్ ప్రకృతి ఒడిలో రూపొందగా అవతార్2 కథ వాటర్‌లో సాగింది. మూడో భాగం వచ్చేసరికి అగ్ని చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈ పార్ట్‌కు ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ అన్న టైటిల్ పెట్టారు.
Also Read : Lokesh Kanakaraj : లోకేష్ కనకరాజ్ సరసన హీరోయిన్ గా నాజూకు బ్యూటీ..
అవతార్3లో విలన్ రోల్‌ను బ్రిటీష్ నటి ఊనా చాప్లిన్ పోషిస్తోంది. ఆమె యాక్ట్ చేస్తున్న వరంగ్ పాత్రను పరిచయం చేస్తూ ఆమధ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్‌కు న్యాయం చేస్తూ ఎర్రటి కన్నులతో రెబెల్‌గా కనిపించింది. ట్రైలర్‌లో కొత్త అగ్ని నేవీ తెగలు పాండోరా మళ్లీ ఎదుర్కొంటున్న ముప్పును మరోసారి ఎమోషనల్‌గా చూపించలేకపోయాడు దర్శకుడు. వరల్డ్ సినిమాలో అవతార్ ఓ సంచలనం. కెమెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచమిది. విఎఫ్‌ఎక్స్ మాయతో కల్పిత గ్రహాన్ని సృష్టించి ప్రకృతి అందాలను కళ్లు చెదిరిలా చూపించాడు. మొదటి రెండు పార్టుల్లో ఆ వండర్ కనిపించినా థర్డ్ పార్ట్ ట్రైలర్ మాత్రం సాదా సీదాగా వుంది. అద్భుతం అని చెప్పేలా ఒక్క షాట్ కూడా లేకపోవడం అవతార్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఎన్నో హోప్స్ పెట్టుకుంటే.. అంచనాలపై నీళ్లు చల్లింది. 2024లో రావాల్సిన అవతార్3 ఈ ఏడాది డిసెంబర్ 19న వస్తోంది. రిలీజ్ నాటికి మరొక ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.