Allu Arjun: మెగాస్టార్ లేకపోతే మీరంతా ఎక్కడ ? అల్లు అర్జున్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
- మెగాస్టార్ లేకపోతే మీరంతా ఎక్కడ ?
- అల్లు అర్జున్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
- ఎవరినీ కించ పరచడానికి రాయలేదు: రేఖ భోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha Boj Sensationa Comments on Allu Arjun: అల్లు అర్జున్ ఫాన్స్ vs మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేఖ భోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పెద్ద పోస్ట్ పెట్టింది. మరీ అంతలా ఎగిరి పడకండి సార్. స్వయం ప్రకటిత స్టార్ గారూ…* ఈ రోజు morning TV లో అలా చానల్స్ తిప్పుతుంటే ఒక దగ్గర పరమానందయ్య శిష్యుల కథ వస్తుంటే ఆపి చూశా. శిష్యులుగా చేసిన పద్మనాభం గారు, రాజబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, సారథి గారు, పూర్ణచంద్ర రావు గారు ఇంకా మిగిలిన వారి పేర్లు తెలియదు. బొద్దపాటి గారు అని గూగుల్ లో ఉంది కానీ ఆయన శిష్యుడిగా చేయలేదు అందులో అని మా నాన్నమ్మ చెప్పింది. పూర్ణ చంద్ర రావు ( లావుటి మనిషి) అనే పేరు కూడా ఆవిడే చెప్పింది. వీళ్లంతా అప్పట్లో ప్రముఖ కమెడియన్స్. ఇంకా వీళ్లే కాకుండా తెలుగులో ఇంకొంత మంది ప్రముఖ కమెడియన్స్ ఉన్నారు. రేలంగి గారు, రమణారెడ్డి గారు, అంజి బాలకృష్ణ గారు, వంగర గారు, ఇంకా కొందరి పేర్లు మిస్ అయి ఉంటే క్షమించాలి. ఇలా అల్లు రామలింగయ్య గారితో సమకాలికులుగా ఉన్న కమెడియన్స్ లో ఆయన కంటే కూడా గొప్ప పేరున్న వారున్నారు ఇందులో కొందరు.
Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
వీరిలో చాలా మందికి సినిమా b/w నుంచి కలర్ లోకి వచ్చాక వేషాలు తగ్గిపోయాయి. కానీ అల్లు గారికి మాత్రం చచ్చేదాకా ఆగలేదు. ఎందుకూ?… ఇంకా వీరిలో చాలా మంది పేర్లు ఈ జనరేషన్ కి తెలియదు. బయట రోడ్డు పైకి వెళ్లి ఈ జనరేషన్ పిల్లలను వీరి పేర్లు అడిగితే తెలియదు అంటారు. But అల్లు రామలింగయ్య గారి పేరు అడిగితే 90% పీపుల్ తెలుసు అంటారు. ఎందుకూ?…. అంతే కాకుండా అలనాటి ప్రముఖ కమెడియన్స్ అందరి వారసులు ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు ఎవరో, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కానీ అల్లు రామలింగయ్య గారి వారసుడు అల్లు అరవింద్ గారు మరియు మనవళ్ళు అందరూ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నారు. ఎందుకూ….? బాబూ! పుష్ప స్టార్ ఫ్యాన్స్ , ఇప్పుడు చెప్పండి, ఎవరి లైఫ్ లోకి ఎవరు వస్తే ఎవరి జీవితాలు బాగుపడ్డాయో….ఆయన మీతో చుట్టరికం చేయడమే కాకుండా తన ప్రేమ, స్నేహాన్ని పంచుతూ ఎటువంటి పక్షపాతం లేకుండా పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ తో పాటుగా నిస్వార్థంగా తన లెగసీ ( వారసత్వాన్ని) మీకు కూడా ఇచ్చాడు.
మీరు నిలబడేదాక మీతో వారు నిలబడ్డారు. మీరు కాస్త నిలదొక్కుకునే దాకా మీ ఫంక్షన్స్ అన్నింటికీ ఆయన గానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చారు. ఆయన మొహం చూసి ఆయన కుటుంబంలో స్టార్స్, ఆయనని ప్రాణంగా భావించే ఫ్యాన్స్ కూడా మీకు సపోర్ట్ గా…ఇంకా గట్టిగా చెప్పాలంటే వీడు మావోడు అని మొదటి సినిమా నుంచే కోట్ల మంది అండగా నిలబడ్డారు… ఇప్పుడు మీ తరపున మెగా ఫ్యామిలీనీ, ఫ్యాన్స్ ని తిడుతున్న వాళ్ళలో ఒక్కడైనా నీ మొదటి సినిమాని థియేటర్ లో చూసాడేమో కనుక్కోండి. hmmm కానీ మీరు మాత్రం ఆయనతో, ఆయన అభిమానులతో just వ్యాపారం చేశారు. ఇక ఈయనతో,ఈ ఫ్యామిలీతో వ్యాపారం లేదు అని పూర్తిగా క్లారిటీ వచ్చాక మీ రియాలిటీ బయటకు తీశారు. మెగాస్టార్ అనేవాడు లేకపోతే మీరంతా ఎక్కడ ఉండేవారో ఒక్కసారి ఇతర కమెడియన్స్ వారసులను చూసి తెలుసుకోండి. వారిలాగా మీ పేర్లు, address లు కూడా మాకు ఈ రోజున తెలిసి ఉండేవి కావు. మీరంతా ఒకసారి కింద వీడియో చూడండి ఈ writeup చదివాక. ఒకప్పుడు మీ హీరో ఎలా ఉన్నాడో , ఏమన్నాడో చూడండి. మీరు కూడా ఆలోచించండి AA fans నేను చెప్పింది నిజమా కాదా?
Note : ఈ rightup ఎవరినీ కించ పరచడానికి రాయలేదు. జస్ట్ ఫాక్ట్స్ చెప్పాలని రాశాను. ఇతర కమెడియన్స్ వారసులెవరూ ఇప్పుడు బాలేరని నా ఉద్దేశం కాదు. వారు ఎవరో ప్రస్తుతం సినీ ప్రేక్షకులకు తెలియదు అన్న పాయింట్ వరకే ఇది వర్తిస్తుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?