‘స్వామి రా రా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కబోతోంది. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా సురేశ్ ప్రొడక్షన్స్ తో కలిసి సునీతా తాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మాతృక అయిన కొరియన్ డ్రామాలో ఇద్దరు యువకులు లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే ఈ తెలుగు రీమేక్ లో ఆ పాత్రలను అమ్మాయిలకు అన్వయిస్తూ దర్శకుడు ఉమెన్ సెంట్రిక్ మూవీగా దీనిని మార్చాడు. రెజీనా కసండ్రా, నివేదా ధామస్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘షాకినీ ఢాకినీ’ అనే పేరు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ ట్రైనీలుగా ఉండే ఇద్దరు అమ్మాయిలు ఊహించని విధంగా ఉమెన్ ట్రాఫికర్స్ గ్యాంగ్ తో తలపడాల్సి వస్తుంది. మానవ రవాణా ముఠా నుండీ తమని తాము ఎలా రక్షించుకున్నారు? మిగిలిన వారిని ఎలా రక్షించారన్నదే ఈ చిత్ర కథ. రెజీనా చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తుండగా, నివేదా థామస్ ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో కీలక పాత్ర పోషించింది. ‘శాకినీ – ఢాకినీ’లుగా రాబోతున్న ఈ అందాల ముద్దుగుమ్మలు ఎలా ప్రేక్షకులను రంజింప చేస్తారో చూడాలి.