Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?

Prabhas Fauji Prequel

Prabhas Fauji Prequel

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత కాస్లీ ఏరియాగా పేరుగాంచిన కోకాపేటలో ప్రభాస్ తన సరికొత్త డ్రీం హౌస్ నిర్మించే పనులను అధికారికంగా ప్రారంభించారు.రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్‌లోనే టాప్ లొకేషన్‌గా దూసుకుపోతున్న కోకాపేట ఓఆర్ఆర్ (ORR) ఎగ్జిట్ సమీపంలో ప్రభాస్‌కు చెందిన రెండు ఎకరాల భారీ స్థలంలో ఈ నూతన గృహ నిర్మాణం జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ స్థలంలో అన్ని రకాల అత్యాధునిక హంగులు, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో కూడిన ఒక ‘అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్’ను ప్లాన్ చేశారు.ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేసిన ఈ లగ్జరీ ప్యాలెస్‌లో భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాతో పాటు ప్రభాస్ సినిమాల సిట్టింగ్స్, కథల చర్చల కోసం ప్రత్యేకంగా ఒక ల్యావిష్ లాంజ్‌ను కూడా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లొకేషన్‌లో గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక భూమి పనులు శరవేగంగా సాగుతున్నాయి. షూటింగ్స్ లేని సమయంలో ప్రభాస్ ప్రశాంతంగా గడిపేందుకు, అలాగే ఇండస్ట్రీ ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు వీలుగా ఈ అల్ట్రా ప్రైవేట్ ప్రాపర్టీని డెవలప్ చేస్తున్నారు. ఒకవైపు కొత్తింటి పనులు చూసుకుంటూనే.. ప్రభాస్ తన లైనప్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.