రవితేజ చాలా వేగంగా సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. సామజవరగమన, #సింగిల్ వంటి సినిమాలకు రైటర్‌గా పనిచేసిన నందు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.
Also Read:GHMC: లంచం తీసుకుంటు.. ఏసీబీకి పట్టుబడిన గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్
నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆగస్టు నెలలో రిలీజ్ చేయాలని భావిస్తుండగా, దాన్ని సెప్టెంబర్‌కి వాయిదా వేయాలని నాగవంశీ చెబుతున్నాడు. ఎందుకంటే, ఆయన నిర్మాణంలోనే వస్తున్న కింగ్‌డమ్ సినిమా జూలైలో రిలీజ్ కావడం, కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను వెనక్కి నెట్టి ఆగస్టులో కింగ్‌డమ్ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు.
Also Read:12 Marriages: నిత్య పెళ్లి కూతురు..! ఇప్పటికే 12 పెళ్లిళ్లు.. ఆమె టార్గెట్ వాళ్లే..
రవితేజ మాత్రం సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ వాయిదా వేయడం సరికాదని, ఆగస్టు నెలలోనే రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నాడట. మరోపక్క, ఆయన ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను సంక్రాంతికి లేదా జనవరి నెలాఖరులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాకు ఇబ్బంది కలగకుండా మాస్ జాతరను ఆగస్టులోనే రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు రవితేజ. మరి, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.
