Site icon NTV Telugu

RT 76: రవితేజతో డిజాస్టర్ కొట్టిన నిర్మాత మరో సినిమా.. రేపే ఓపెనింగ్

Ravi Teja

Ravi Teja

మాస్ మహారాజా రవితేజ తన 76వ చిత్రం ‘RT 76’తో మరోసారి సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా రేపు (జూన్ 5, 2025) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానుంది. రవితేజ ట్రేడ్‌మార్క్ స్టైల్‌తో కూడిన హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాతలు ప్రకటించారు. సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేశారు.

Also Read:Asian Max: బాలాపూర్‌లో ఏషియన్ మ్యాక్స్ థియేటర్ కాంప్లెక్స్ ప్రారంభం

సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఈ కొత్త సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా రవితేజ మాస్ అప్పీల్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లను హైలైట్ చేసేలా రూపొందనుంది. ‘RT 76’ చిత్రం రేపు హైదరాబాద్‌లో జరిగే పూజా కార్యక్రమంతో అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ కార్యక్రమంలో రవితేజ, నిర్మాత సుధాకర్ చెరుకూరి, దర్శకుడు కిషోర్ తిరుమలతో పాటు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సినిమా రవితేజ అభిమానులకు ఒక ఫుల్-ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా ఉంటుందని, ఆయన సిగ్నేచర్ స్టైల్‌తో పాటు కామెడీ, యాక్షన్, డ్రామా అంశాలను సమపాళ్లలో అందిస్తుందని ఇన్ సైడ్ టాక్.

Also Read:NTR-RCB: ఇది కదా గిఫ్ట్ అంటే?

ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లు నటించనున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ, వారి పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై గతంలో ‘దసరా’, ‘రామారావ్ ఆన్ డ్యూటీ’, ‘పడి పడి లేచే మనసు’ వంటి విభిన్న చిత్రాలను నిర్మించారు. ముందు సినిమాలు బోల్తా పడినా ‘దసరా’ మాత్రం 2023లో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా ₹121 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Exit mobile version