Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!

Ravi Teja

Ravi Teja

Irumudi Kattu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. భక్తి, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ రాజాకు ఈ సినిమా గ్యారెంటీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలోని మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఇరుముడి కట్టు’ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

జూన్ 29వ తేదీన ఉదయం 11:07 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా థీమ్‌ను ఎలివేట్ చేసేలా, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేలా ఈ సాంగ్ ఉండబోతుందని టాక్. ఈ చిత్రానికి సంచలన కంపోజర్ జి.వి.ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండటంతో సాంగ్స్ పైన భారీ హైప్ నెలకొంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఈ చిత్రాన్ని 2026, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.