ఓటీటీలో రవిబాబు ‘క్రష్’! ఎప్పుడంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శక నిర్మాత రవిబాబు రాజీ పడలేదు! ఆయన లేటెస్ట్ మూవీ ‘క్రష్’ ఇటీవల సెన్సార్ కు వెళ్ళింది. అందులో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉండటంతో సెన్సార్ సభ్యులు మొత్తం తొమ్మిది కట్స్ ఇచ్చారని తెలిసింది. అయితే వాటిని కట్ చేస్తే సినిమా ఫ్లో దెబ్బతింటుందని భావించిన రవిబాబు… అందుకు అంగీకరించలేదట. దాంతో అంతా రవిబాబు రివైజింగ్ కమిటీకి వెళ్తాడేమో అనుకున్నారు. కానీ కథ ఇక్కడే ఓ కొత్త మలుపు తిరిగింది. రివైజింగ్ కమిటీ కి కాకుండా రవిబాబు ఓటీటీ బాట పట్టారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలను సెన్సార్ చేయాల్సిన పనిలేదు. అక్కడైతే తన సినిమాను ఎలాంటి కట్స్ లేకుండానే వీక్షకులకు చూపించొచ్చు.
రవిబాబు కోరుకున్నది జీ 5 కు కలిసి వచ్చింది. ఈ అడల్ట్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆ సంస్థ సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా జీ 5 లో జూలై 9వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్ సాయి, అంకిత మనోజ్, పాండే, శ్రీసుధా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. అమెరికా వెళ్ళాలనుకునే ముగ్గురు కుర్రాళ్ళు లైంగిక అనుభవం ముఖ్యమని భావించి ఏం చేశారనే కాన్సెప్ట్ తో ఈ అడల్ట్ కామెడీ మూవీ తెరకెక్కినట్టు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. హారర్, థ్రిల్లర్, కామెడీ జానర్స్ లో సినిమాలు తీసిన రవిబాబు… గతంలోనూ ఈ తరహా మూవీస్ కొన్ని తీశాడు కానీ… ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అడల్ట్ కంటెంట్ నే నమ్ముకున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!