ఇటీవల రష్మిక హీరోయిన్గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా రూపొందింది. ఆ సినిమా నవంబర్ ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా రిజల్ట్ విషయంలో రష్మిక అయితే చాలా హ్యాపీగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా జగపతిబాబుతో ఒక షో చేస్తున్న సమయంలో, ఆమె మగవాళ్ళకి కూడా పీరియడ్స్ రావాలని, అప్పుడే ఆడవాళ్ళ పెయిన్ అర్థమవుతుందంటూ కామెంట్ చేసింది. అయితే, ఆమె ఉద్దేశంలో ఆడవాళ్ళ బాధ మగవాళ్ళకి అర్థం కావాలి అనే మాట కరెక్టే అయి ఉండవచ్చు. అయితే, దానికోసం పీరియడ్స్ రావాలా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read:Peddi : ‘పెద్ది’తో నా కల నెరవేరింది.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్
సమాజంలో ఆడవాళ్ళకు లేని టెన్షన్లు సైతం మగవాళ్ళకి ఉన్నాయని, ఆడవాళ్ళకు పీరియడ్స్ ఒక్కటే పెయిన్ అయితే, మగవాళ్ళకు సంపాదించే వయసు వచ్చినప్పటి నుంచి అంతకన్నా ఎక్కువ పెయిన్, ప్రెషర్, మెంటల్ డ్రామా అనుభవిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. సినిమా ప్రమోట్ చేసుకునే రష్మికకు ఎలాంటి కామెంట్స్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా మగాళ్ళ అందరికీ పీరియడ్స్ పెయిన్ తెలియాలి అనే రష్మిక వాదన ఏమాత్రం కరెక్ట్ కాదంటున్నారు. దేవుడు ఒక్కొక్క ప్రాణిని ఒక్కొక్కలా సృష్టించాడు. అలాగే, ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క బాధ్యత పగించాడు. కాబట్టి, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి పెయిన్స్ వాళ్ళవి. ఇప్పుడు వచ్చి పీరియడ్ పెయింట్స్ మగాళ్ళకి ఉండాలంటే ఎలా? అనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.