Rashmika: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ అండ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల ప్రేమాయణం ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కింది. పెళ్లయిన తర్వాత భార్యాభర్తలుగా ఈ జంట నటించిన లేటెస్ట్ చిత్రం ‘రణబాలి’ ఈ వీకెండ్లోనే థియేటర్లలోకి వచ్చి సందడి చేస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో తెగ బిజీగా గడుపుతున్న ఈ క్రేజీ జంట.. తాజాగా తమ సీక్రెట్ పెళ్లి ప్రపోజల్ వెనుక జరిగిన అసలు కథను బయటపెట్టి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. విజయ్ పెళ్లి చేసుకోవడానికి ఎంతలా ఆటపట్టించాడో రష్మిక స్వయంగా రివీల్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ తాజా సీజన్లో విజయ్ – రష్మిక జంటగా సందడి చేశారు. హోస్ట్ కరణ్ జోహార్ వీరిని పలకరిస్తూ.. “మీ ఇద్దరిలో మొదట ఎవరు ప్రపోజ్ చేసుకున్నారు?” అని గుచ్చి గుచ్చి అడిగాడు. దానికి విజయ్ నవ్వుతూ బదులిస్తూ.. “రష్మికే నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందాం అని అడిగింది. కానీ అంత ఈజీగా ఒప్పుకుంటే మజా ఏముంటుంది? అందుకే నన్ను మరో వంద సార్లు అడగమని చెప్పా” అంటూ నవ్వేశాడు.
విజయ్ చెప్పిన మాటకు పక్కనే ఉన్న రష్మిక వెంటనే స్పందిస్తూ.. “అవును, పెళ్లి చేసుకుందాం అని ఒప్పుకోవడానికి నన్ను ఏకంగా ఏడాది పాటు తిప్పించుకున్నాడు” అంటూ తమ ప్రేమ ప్రయాణంలోని ముచ్చట్లను సరదాగా చెప్పుకొచ్చింది. షోలో మరో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. “రష్మిక కాకుండా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిన హీరోయిన్ ఎవరు?” అని కరణ్ విజయ్ను అడిగాడు. విజయ్ నోరు విప్పకముందే పక్కనే ఉన్న రష్మిక కల్పించుకుని.. ‘ఎవరూ లేరు.. ఎవరూ కాదు’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. దానికి విజయ్ ఏమాత్రం తడబడకుండా.. “భార్య ఏం చెబితే అదే ఫైనల్.. నేను అదే ఫాలో అవుతా” అంటూ నవ్వించేశాడు. సరదా సంభాషణలు, వీరిద్దరి కెమిస్ట్రీతో సాగిన ఈ ప్రోమో క్షణాల్లో వైరల్గా మారింది. రష్మిక-విజయ్ల పూర్తి రొమాంటిక్ చిట్చాట్ ఎపిసోడ్ వచ్చే బుధవారం (అక్టోబర్ 21)న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

