టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం తర్వాత తొలిసారి జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘రణబాలి’. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అక్టోబర్ 16న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, తాజాగా జరిగిన ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నేషనల్ క్రష్ రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా భర్త విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.
స్టేజ్ పై విజయ్ వైపు చూస్తూ మురిసిపోయిన రష్మిక.. తనలోని ప్రేమను, అభిమానాన్ని దాచుకోలేకపోయింది. “విజ్జూ.. నాకు అసలు పెళ్లయిందన్న ఫీలింగే కలగడం లేదు. నిన్ను చూస్తుంటే ఇప్పుడు కూడా ఒక ‘ఫ్యాన్ గర్ల్’ లాగే అనిపిస్తోంది. ఐ యామ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్” అంటూ పబ్లిక్‌గా తన మనసులోని మాటను బయటపెట్టింది. పెళ్లి తర్వాత కూడా భర్తపై ఆమె చూపిస్తున్న ఈ ఆరాధన భావం చూసి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. సినిమా సెట్‌లో విజయ్ డెడికేషన్ చూసి తాను ఎలా భయపడిపోయిందో రష్మిక వివరించింది. “నేను నెలకు నాలుగైదు రోజులు సెట్‌కి వెళ్లేదాన్ని. నాకైతే ఏదో పిక్నిక్‌కి వెళ్లినట్లు సరదాగా ఉండేది. కానీ విజయ్, డైరెక్టర్ రాహుల్, మూవీ టీమ్ అంతా చాలా సీరియస్‌గా పని చేసేవారు. ముఖ్యంగా విజయ్ మీసాలు తిప్పుతూ ఆ రౌద్రంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంటే నాకు భయమేసేది. ఆ సెట్‌లో కాస్ట్ అండ్ క్రూ అంతా ఇంకో మెంటల్ లెవెల్‌కి వెళ్లిపోయారు. ఒక ‘గాడ్ మోడ్’లో పనిచేశారు. ఫస్ట్ ఆడియన్‌గా నేను చెప్తున్నా.. సినిమా చూస్తుంటే వేరే ప్రపంచంలోకి వెళ్లిపోవడం గ్యారెంటీ” అని రష్మిక ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసింది.
ఈ సినిమాలో తన పాత్ర పేరు ‘జయమ్మ’ అని, అది డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ వాళ్ల అమ్మగారి పేరని చెప్పగానే తన మనసు కరిగిపోయిందని రష్మిక ఎమోషనల్ అయ్యింది. ఇంత గొప్ప క్యారెక్టర్‌ను వదులుకోకూడదనే ఉద్దేశ్యంతోనే వెంటనే ఓకే చెప్పేశానని తెలిపింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల కంటే ఇందులో తమ లవ్ ట్రాక్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందని అభిమానులకు హామీ ఇచ్చింది. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం రష్మిక ఇచ్చిన స్పీచ్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. భార్యాభర్తలుగా మారిన తర్వాత ఈ హిట్ పెయిర్ వెండితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలంటే అక్టోబర్ 16 వరకు ఆగాల్సిందే!

