ఈ ఏడాది భారతీయ సినీ ప్రపంచంలో రష్మిక మందన్నా సందడి వేరే స్థాయిలో ఉంది. నెల గ్యాప్‌కే ఒక సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన నాలుగు సినిమాలు ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించగా, గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమలోని కొత్త కోణాన్ని చూపించబోతున్నామని దర్శకుడు తెలిపారు.ఈ నేపథ్యంలో రష్మిక ప్రమోషనల్ ఈవెంట్లలో బిజీగా ఉంది. షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన ముద్దు మాటలతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా,
Also Read : Peddi : చరణ్ కొత్త సాంగ్ కోసం ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌మెంట్ – “చికిరి చికిరి” అర్థం నేడు రివీల్!
తాజాగా ఆమె జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించింది. షో లో రష్మిక తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ, స్కూల్ రోజుల్లో జరిగిన సరదా సంఘటనలను గుర్తు చేసింది. జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు రష్మిక ఇచ్చిన సరదా సమాధానాలు అందరిని నవ్వించగా, ఆమె చెప్పిన ఒక మాట మాత్రం ప్రత్యేకంగా వైరల్ అయింది. రష్మిక మాట్లాడుతూ “మగాళ్లకు పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది” అని చెప్పింది. ఈ వ్యాఖ్య విన్న జగపతిబాబు, ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం రష్మిక ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో కూడా నటిస్తోంది. అదనంగా బాలీవుడ్‌లో మరో కొత్త ప్రాజెక్ట్ సెట్ అవుతోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో కూడా నటిస్తోంది. పలు క్రేజీ ప్రాజెక్టులపై చర్చలు కొనసాగుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
