ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది “పుష్ప” టీం. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరగనుందట. జూలై 5న ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే సుకుమార్ లొకేషన్లను కూడా ఫిక్స్ చేశారట. ఈ అందమైన గోవా లొకేషన్లు సినిమాలో ప్రేక్షకులకు కన్నుల విందు చేయనున్నాయి. అంతేకాదు ఈ షెడ్యూల్లో పుష్ప రాజ్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ ను కూడా చిత్రీకరించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. పుష్ప గోవా షెడ్యూల్ తరువాత అల్లు అర్జున్ ఆగస్టులో “ఐకాన్” షూట్లో చేరే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో గ్రామీణ అమ్మాయిగా కనిపించబోతున్న రష్మిక ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ను కేటాయించిందట. ప్రస్తుతం రష్మిక పలు సౌత్ తో పాటు నార్త్ సినిమాలతో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Read Also : బోల్డ్ సీన్ లో హాట్ బ్యూటీ ?
ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంది. అందుకే త్వరగా “పుష్ప” షూటింగ్ ను పూర్తి చేయాలని భావించిన రష్మిక అందుకోసం బల్క్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం. జూలై 7 నుండి సెట్స్ లో జాయిన్ అవ్వనున్న ఈ భామ నెలరోజుల పాటు షూటింగ్ లో పాల్గొననుంది. ఆ తరువాత ఆమె తన హిందీ ప్రాజెక్ట్స్ కోసం ముంబైకి తిరిగి వెళ్లనుంది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా…మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది.