Site icon NTV Telugu

Ramayana: రణబీర్ కి షాకింగ్ రెమ్యునరేషన్

Ramayana

Ramayana

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రామాయణ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి యానిమల్ సినిమాతో ఆయన మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు. ఈ రామాయణ కాకుండా ఆయనకు లైనప్‌లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

Also Read:Ratsasan 2: మళ్ళీ వణికించడానికి వస్తున్నారు!

రామాయణం సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాకు ఏకంగా 1600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా ఫ్రాంచైజీలో నటించేందుకు రణబీర్ కపూర్ ఏకంగా 150 కోట్లు ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read:Patancheru: ఫ్యాన్ కు టవల్ వేసుకొని ఊయల ఊగిన చిన్నారి.. పవర్ రావడంతో ఘోరం

మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి, రెండో భాగం ఆ తర్వాత వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఒక్కో భాగానికి 75 కోట్లు చొప్పున రణబీర్ కపూర్ ఛార్జి చేస్తున్నాడు. మరోపక్క, ఈ సినిమాలో సీత క్యారెక్టర్‌లో నటిస్తున్న సాయి పల్లవి ఒక్కో భాగానికి 6 కోట్లు చొప్పున ఛార్జి చేస్తోంది. మొత్తం ఈ ఫ్రాంచైజీకి ఆమె 12 కోట్లు ఛార్జి చేస్తోంది. ఇక రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నాడు. ఆయన కూడా గట్టిగానే ఛార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Exit mobile version