Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్‌ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!

Ranabaali

Ranabaali

Ranabaali: టాలీవుడ్‌లో ఇప్పుడు కం బ్యాక్‌ల జోరుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండ కం బ్యాక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా ‘రణబలి’పై సినీ అభిమానుల్లో, విజయ్ ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ ఈ వారంలోనే వచ్చే అవకాశం ఉందంట. ఈ అప్డేట్‌లో కొత్త పోస్టర్‌తో పాటు సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రాన్ని 19వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కుతున్నారని సమాచారం. ఈ సినిమాను వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ఆధారంగా చేసుకున్న యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం. గతంలో విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టాక్సీవాలా’కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే రష్మిక మందన్న గాయపడటంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరిగిన కారణంగా.. ఈ సినిమా రిలీజ్‌కు అక్టోబర్‌కు మారే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విడుదల తేదీ మార్పుపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఇప్పటికే ‘రణబాలి’ నుంచి విడుదలైన ‘ఏందయ్యా సామీ’ పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో కనిపించనుండటం కూడా కలిసి వచ్చే అవకాశంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రణబాలి’ నుంచి ఈ వారంలో అధికారిక ప్రకటన వస్తుందన్న వార్త నిజమేనా? విడుదల తేదీపై మేకర్స్ ఏం చెబుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.