కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన (రమ్య)పై, ప్రముఖ హీరో దర్శన్ అభిమానులు.. సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్లు చేస్తూ, తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అసభ్యకరమైన బూతులు, తేడాగా వ్యాఖ్యలు చేస్తూ, అత్యాచారం చేస్తామంటూ భయాందోళన కలిగించే మెసేజ్ లు పంపిస్తున్నారు. అంతటితో ఆగకుండా, ‘రేణుక స్వామి బదులుగా నిన్నే హత్య చేసి ఉండాల్సింది’ అనేలా బెదిరింపులు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ వేధింపులపై స్పందించిన రమ్య..
Also Read : Shruti Hassan : అదే నా డ్రీమ్ రోల్..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలవనున్నాను, ఇప్పటికే న్యాయవాదులను సంప్రదించాను. నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేస్తున్న వారిని గుర్తించాం. బూతులు తిట్టిన సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాక్ష్యంగా స్క్రీన్ షాట్‌లు కూడా సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు రమ్య. అంతేగాక, సోషల్ మీడియాలో మహిళా ప్రజాప్రతినిధులు జరుగుతున్న వ్యక్తిగత దాడులను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు.. ‘మహిళను లక్ష్యంగా చేసుకుని బూతులు తిట్టడం ఒక అలవాటుగా మారింది. వారిని శిక్షించేందుకు సరైన చట్టాలు లేకపోవడమే వాళ్ల ధైర్యానికి కారణం’ అని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒక మహిళను వేదించాలంటే, మొదట ఆమె క్యారెక్టర్‌ను దెబ్బకొట్టాలన్న కుట్రతో కొందరు సోషల్ మీడియాలో ఇలా వ్యవహరిస్తున్నారు’ అని చెప్పారు.
ఇక దర్శన్‌కు లక్షలాది మంది అభిమానులుండగా, ఆయన ఇటీవల రేణుకస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రమ్య గతంలో ‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పెద్ద తప్పు’ అంటూ దర్శన్ చర్యల్ని తప్పుబట్టారు. ‘ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే అకౌంట్‌ను బ్లాక్ చేయాలి, లేదంటే పోలీసులను ఆశ్రయించాలి. కానీ కొట్టి చంపడం అంటే ఏంటి?’ అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల వల్లే దర్శన్ అభిమానులు ఆమెపై వ్యక్తిగత స్థాయిలో విరుచుకుపడుతున్నారు.