Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramya Krishna: టాలీవుడ్ సినీ చరిత్రలో ‘నీలాంబరి’, ‘శివగామి’ పాత్రల పేరు చెబితే రమ్యకృష్ణ తప్ప మరొకరు కళ్ల ముందు కనిపించరు. రజనీకాంత్ సరసన ‘నరసింహ’లో ఆమె ప్రదర్శించిన పంతం, రాజమౌళి సృష్టించిన ‘బాహుబలి’లో మాహిష్మతి రాజమాతగా ఆమె చూపించిన రాజసం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే, తన కెరీర్‌నే మలుపుతిప్పిన ఈ రెండు ఐకానిక్ పాత్రలను చేయడానికి తాను మొదట అస్సలు ఇష్టపడలేదని రమ్యకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టారు. అసలు ఆ రెండు సినిమాలను ఎందుకు రిజెక్ట్ చేయాలనుకున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
‘నరసింహ’ (పడియప్ప) సినిమాలో నీలాంబరి పాత్ర తన దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంకోచించానని రమ్యకృష్ణ తెలిపారు. “‘అమ్మోరు’ సినిమాతో సౌందర్య నా కళ్ల ముందే కెరీర్ మొదలుపెట్టి, వరుస విజయాలతో టాప్ రేంజ్‌కు వెళ్లింది. అప్పట్లో ఇండస్ట్రీలో ‘సో-కాల్డ్ నెంబర్ వన్, నెంబర్ టూ’ అనే పోటీ ఉండేది. నేను వాటిని నమ్మకపోయినా చుట్టుపక్కల అందరూ దాని గురించే మాట్లాడేవారు. సరిగ్గా అలాంటి సమయంలో సౌందర్యకు వ్యతిరేకంగా నెగెటివ్ రోల్ చేసే అవకాశం నాకు వచ్చింది. నా కళ్ల ముందే ఎదుగుతున్న హీరోయిన్‌కు నేను విలన్‌గా చేయాలా? అని నా మనసు అంగీకరించలేదు” అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఎంత గొప్పగా రాసిన పాత్ర అయినా, చివరకు హీరో హీరోయిన్లకే పేరు వస్తుందని, విలన్ పాత్ర ఎప్పుడూ మూడో లేదా నాలుగో స్థానంలోనే ఉంటుందని తాను భావించినట్లు చెప్పారు. ఆ ఇష్టం లేని తనంతోనే షూటింగ్‌కు వెళ్లేదాన్ని కానీ, ఒక్కసారి కెమెరా ముందు నిలబడ్డాక మాత్రం వంద శాతం నా నటనను ఇచ్చానని, అదే ఆ పాత్రను చరిత్రలో నిలబెట్టిందని వివరించారు.
Also Read
- Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ... కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
- Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
- Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
ఇక ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపు తెచ్చిన ‘బాహుబలి’ సినిమా వెనుక కూడా ఒక ఆసక్తికర కథ ఉందని రమ్యకృష్ణ వెల్లడించారు. ఆ సమయంలో తాను టీవీ సీరియల్స్ నిర్మాణంలో చాలా బిజీగా ఉన్నానని, ప్రతి నెలా ఎపిసోడ్స్, టీఆర్పీల ఒత్తిడితో పాటు కొడుకు బాధ్యతలతో సతమతమవుతున్నానని చెప్పారు. “సరిగ్గా అలాంటి టైంలో నిర్మాత శోభు యార్లగడ్డ నాకు ఫోన్ చేసి ‘బాహుబలి’ సినిమా కోసం 40 రోజుల కాల్షీట్లు కావాలని అడిగారు. నాకు అంత టైం లేదని, 40 రోజులు అస్సలు కుదరదని చెప్పి ఫోన్ పెట్టేశాను. అప్పటికి నేను కథ కూడా వినలేదు” అని రమ్యకృష్ణ తెలిపారు. అయితే, ఈ విషయం తెలిసిన తన తండ్రి ఇంట్లో తనపై గట్టిగా అరిచారని అన్నారు. ‘అది తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా, రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు.. అలాంటి సినిమాను ఎందుకు వద్దన్నావు?’ అని నాన్న మందలించారని గుర్తుచేసుకున్నారు.
ఆ తర్వాత శోభు యార్లగడ్డ మరోసారి సంప్రదించి ముందు కథ వినమని కోరడంతో రాజమౌళిని కలిశానని రమ్యకృష్ణ చెప్పారు. రాజమౌళి కథ చెబుతుంటే ఒక అద్భుతమైన సినిమాను కళ్ల ముందు చూసినట్లు అనిపించిందని, ఆ స్టోరీ నచ్చడంతో వెంటనే శివగామి పాత్రకు ఒప్పుకున్నానని అన్నారు. ఏ పాత్ర అయినా ఐకానిక్ అవుతుందని ఊహించి చేయలేమని, కేవలం మనం ఇచ్చే వంద శాతం కష్టమే వాటిని ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని రమ్యకృష్ణ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!