Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Release Twist: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా రిలీజ్ తేదీ విషయంలో కొత్త చర్చ మొదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లో ముందుగా సినిమాను విడుదల చేసి.. రెండు రోజుల తర్వాత ఇండియాలో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తాజాగా నిర్మాత వెల్లడించినట్లు సమాచారం. సాధారణంగా ఇండియన్ సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో మన దేశంలో కంటే కొన్ని గంటల ముందే ప్రీమియర్ అవుతుంటాయి. అయితే ‘రామాయణ’ విషయంలో ఏకంగా రెండు రోజుల గ్యాప్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవర్సీస్లో సినిమా శుక్రవారం విడుదలై.. ఇండియాలో ఆదివారం ప్రేక్షకుల ముందుకు వస్తే, ఈ మధ్యలో సినిమా టాక్ పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ వ్యూహం మేకర్స్‌కు కలిసొచ్చే అవకాశముంది. ఓవర్సీస్లో మంచి రెస్పాన్స్ వస్తే ఇండియాలో భారీ ఓపెనింగ్స్ రావొచ్చు. థియేటర్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు. ఓవర్సీస్ రివ్యూలు, సోషల్ మీడియా టాక్ ప్రభావం ఇండియన్ ఆడియన్స్‌పై పడే అవకాశం ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారు కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆదివారం రిలీజ్ చేయడం వల్ల శనివారం లభించే వీకెండ్ వసూళ్లను సినిమా కోల్పోయే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవర్సీస్ వసూళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక మేకర్స్ వ్యూహం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ‘రామాయణ’ రిలీజ్ ప్లాన్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశ్నలు సంధిస్తున్నారు. చూడాలి మరి చిత్ర బృందం నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందనేది.
Also Read
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
- Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
- Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
- Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
తాజావార్తలు
-
Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
-
Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
-
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకు భారీ డిమాండ్.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలుసా!
-
VVS Laxman: ఆ పదాన్ని వాడితే ఊరుకునేది లేదు… వీవీఎస్ లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!