Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న సినిమాల్లో చిన్న పాత్ర దొరికినా పెద్ద స్టార్స్ కూడా తమ అదృష్టంగా భావిస్తుంటారు. తెరపై కనిపించేది కొద్ది సేపే అయినా.. సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం సందడి చేస్తుంటారు. అయితే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రామాయణ’ ప్రమోషన్స్‌కు చందమామ కాజల్ అగర్వాల్ దూరంగా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఈ సినిమాలో చందమామ భాగమైందా? లేదా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
రామాయణ టీజర్, ట్రైలర్లలో కాజల్ అగర్వాల్ కనిపించలేదు. ఢిల్లీ నుంచి చెన్నై వరకు నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనూ ఆమె ప్రస్తావన తీసుకురాలేదు. దీంతో రామాయణలో కాజల్ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో కీలక నటీనటులంతా పాల్గొంటుండగా.. కాజల్ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. రామాయణలో రాముడు, సీత, రావణాసురుడి పాత్రల్లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, వివేక్ ఒబెరాయ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరంతా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. అయితే లారా దత్తా, కాజల్ మాత్రం ఈవెంట్స్‌కు దూరంగా ఉన్నారు.
Also Read
లారా దత్తా ప్రమోషన్లకు హాజరుకాకపోయినా.. చిత్రబృందం ఆమె పేరును ప్రస్తావిస్తోంది. కానీ కాజల్ అగర్వాల్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో చందమామ ఈ సినిమాలో నటించిందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో కాజల్ స్వయంగా రామాయణలో చిన్న పాత్ర చేస్తున్నట్లు వెల్లడించింది. రావణాసురుడి భార్య మండోదరిగా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఆమె పాత్రకు పెద్దగా స్క్రీన్ ప్రజెన్స్ లేకపోవడంతోనే ప్రమోషన్లకు దూరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు చిత్రబృందం కూడా కాజల్ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో.. ఫైనల్ ఎడిటింగ్‌లో ఆమె పాత్రను తొలగించి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుమారు 3 గంటల 15 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామాయణ తొలి భాగంలో కాజల్ ఉందా? లేదా? అన్నది తెలియాలంటే నవంబర్ 5 వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన!
-
Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
-
Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
ట్రెండింగ్
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!