Dharman : రజనీకాంత్ ధర్మన్ సినిమాలో రామ్ పోతినేని?

Dharman

Dharman

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా ‘ఓ మై కడవులే’, ‘డ్రాగన్’ ఫేమ్ అశ్విన్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ధర్మన్‘. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్‌డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్‌కు అల్లుడి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై మైండ్ బ్లోయింగ్ హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ రామ్‌ను ఈ పవర్ ఫుల్ రోల్ కోసం ఎంపిక చేశారట.

కాగా ఈ సినిమాలో రజనీ భార్యగా సిమ్రాన్ నటిస్తుండగా కూతురుగా యంగ్ బ్యూటీ రాశిఖన్నా నటిస్తోంది. రాశికి జోడిగా మామ రజినీకి అల్లుడుగా రామ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఉన్న క్రేజ్‌కి రామ్ పోతినేని ఎంట్రీ తోడైతే సౌత్ ఇండియా వ్యాప్తంగా సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ మారిముత్తు ఈ చిత్రాన్ని వినూత్నమైన కాన్సెప్ట్‌తో, హై-వోల్టేజ్ డ్రామాగా మలుస్తున్నారని సమాచారం. రజినీకాంత్ సరసన సిమ్రాన్, రాశి ఖన్నా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే రామ్ పోతినేని రోల్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.