సంక్రాంతి పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ హిట్ సాధించడం కోసం ప్రతి హీరో, దర్శకుడు ప్రయత్నిస్తారు. అలాగే ఈ సారి 2026 సంక్రాంతి బరిలోకి కూడా పలువురు తెలుగు, తమిళ హీరోలు తమ సినిమాలను విడుదలకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ కూడా జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ఆసక్తిని గరిష్ట స్థాయికి తీసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు.
Also Read : Karan Johar : బాలీవుడ్‌లో స్నేహాలు పార్టీల వరకే.. ఆపదొస్తే ఎవ్వరు రారు
అలాగే తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయకుడు’ కూడా అదే రోజున, జనవరి 9న రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది. ఈ పరిస్థితి వల్ల తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘రాజా సాబ్’కి మార్గంలో చిన్నపాటి అడ్డంకులు రావచ్చని అభిమానులు మరియు ట్రేడ్ వర్గాలు ముందే అంచనా వేసారు. ఇంతకు ముందు ఇదే రోజున రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం వలన ప్రేక్షకులు, థియేటర్ల వర్గంలో కొంత గందరగోళం ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. కానీ..
ఇటీవల కరూర్‌లో విజయ్ నిర్వహించిన పొలిటికల్ మీటింగ్‌లో జరిగిన దురదృష్టకర ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఈ కారణంగా ఆయన ‘జన నాయకుడు’ విడుదల తేదీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన సినిమాను వాయిదా వేస్తే, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ కు లైన్ క్లియర్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాక, పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రభాస్ సినిమా అడ్డుకునే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక నిజంగా విజయ్ ప్రభాస్ కోసం లైన్ క్లియర్ అవుతుందా చూడాలి.