Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక సునామీలా మారబోతోందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూస్తుంటే, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్‌కు ఇది ఒక జాక్‌పాట్ మూవీగా నిలవడం ఖాయమనిపిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అప్పుడే రికార్డులను తిరగరాస్తోంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన కేవలం 30 నిమిషాల్లోనే 50 వేల డాలర్స్ గ్రాస్‌ని క్రాస్ చేసి దుమ్ములేపింది. అలాగే.. 4 గంటల్లోనే లక్ష డాలర్ మార్కును దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Also Read: NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
రిలీజ్‌కు నాలుగు వారాల ముందే ఓవర్సీస్ రెస్పాన్స్ ఈ స్థాయిలో ఉందంటే, ఇక జూన్ 4న సినిమా విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని B మరియు C సెంటర్లలో వచ్చే స్పందన ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవంచ్చు. గ్రామీణ నేపథ్యంలో సాగే క్రీడా కథాంశం కావడంతో, సామాన్య ప్రేక్షకులు, మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ కలిసి.. బి, సి సెంటర్ల థియేటర్ల వద్ద జరగబోయే మాస్ జాతరకు భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పైగా ఈ సమ్మర్‌లో ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. అందుకే.. ఇప్పుడు పెద్ది రాక కోసం మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఓవర్సీస్ ట్రెండ్ చూస్తుంటే, సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వసూళ్లు ఊహకందని రీతిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూస్తే, పెద్ది బాక్సాఫీస్ వద్ద మెగా దాహం తీర్చేలాగే ఉంది.
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!