kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kajal Aggarwal: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ‘మగధీర’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై జరిగిన ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్‌ను కాజల్ అగర్వాల్ తాజాగా బయటపెట్టింది. షూటింగ్ గ్యాప్‌లో రామ్ చరణ్ తనను ఎలా ఆటపట్టించేవాడో గుర్తుచేసుకుంటూ కాజల్ పంచుకున్న ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. మగధీర సినిమాలో గుర్రపు స్వారీ సీన్లు ఎంత ఫేమస్సో మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ తన సొంత గుర్రం ‘బదల్’ను షూటింగ్‌కు తీసుకొని వచ్చాడు. షూటింగ్ బ్రేక్‌లో తనను గుర్రంపై ఊరేగించడం ఒకెత్తయితే, ఆ తర్వాత చరణ్ చేసిన అల్లరి మరో ఎత్తు అని అన్నారు. సెట్‌పై తాను ఎప్పుడు కనిపించినా రామ్ చరణ్ తన గుర్రం పేరు “బదల్… బదల్…” అని పదేపదే గట్టిగా పిలుస్తూ తనను టీజ్ చేసేవాడని చెప్పుకొచ్చారు. ఆ టైంలో చరణ్ చేసిన ఫన్నీ కామెంట్లు, ఆటపట్టించిన విధానం ఇప్పటికీ తన గుండెల్లో గుర్తిండిపోయాయని కాజల్ నవ్వుతూ చెప్పుకొచ్చింది. మగధీర లాంటి భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమా షూటింగ్ అంత ఒత్తిడిలో జరుగుతున్నా, రామ్ చరణ్ మాత్రం సెట్స్‌ను ఇంత సరదాగా, హ్యాపీగా ఉంచేవాడని ఈ ముచ్చట విన్నాక మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చరణ్ నిజంగానే ‘సెట్ మాస్టర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!