టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసే వార్త ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆర్య’ సినిమా నుంచి మొదలైన దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ల ఐకానిక్ కాంబినేషన్‌కు తొలిసారిగా బ్రేక్ పడింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించబోయే భారీ ప్రాజెక్ట్ (RC17) కోసం దేవిశ్రీ స్థానంలో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఫైనల్ అయ్యాడు. సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా అందులో దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్ ఉండాల్సిందే. వీరిద్దరిదీ దాదాపు రెండు దశాబ్దాల విడదీయరాని బంధం. అయితే రామ్ చరణ్ 17వ సినిమాకు ఈ కాంబో రిపీట్ కాకపోవడానికి ఓ బలమైన కారణం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం హీరోగా తన ‘యాక్టింగ్ డెబ్యూ’ పనుల్లో ఫుల్ బిజీగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో సుకుమార్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సౌత్ సెన్సేషన్ అనిరుధ్‌ను రంగంలోకి దించాడు. అనిరుధ్ మార్క్ ఎలివేషన్స్ బిజిఎమ్, సుకుమార్ బ్రిలియంట్ టేకింగ్, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు ఖాయమని మెగా ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
భారీ అంచనాల నడుమ ‘RC17’ మూవీ రేపు (నవంబర్ 1వ తేదీన) అత్యంత ఘనంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ కాబోతోంది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్, సుకుమార్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఎనలేని క్రేజ్ నెలకొంది. రేపు గ్రాండ్‌గా ముహూర్తం షాట్ జరుపుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2027 జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ పాన్ ఇండియా సినిమాలో చరణ్ సరసన రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. గత కొద్ది రోజులుగా సారా అర్జున్, సాత్విక వీరవల్లి, భాగ్యశ్రీ బోర్సే లాంటి పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ.. ప్రస్తుతానికి వాళ్లిద్దరూ ఈ ప్రాజెక్ట్‌లో లేరని అంటున్నారు. ఇంకా హీరోయిన్ వేట కొనసాగుతూనే ఉంది. ఈ హై-వోల్టేజ్ స్క్రిప్ట్‌లో ఆ అదృష్టం ఏ భామను వరిస్తుందో చూడాలి!

