Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!

Peddi

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు వీకెండ్ అదిరిపోయే మాస్ ట్రీట్ వచ్చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI) నుండి మోస్ట్ అవైటెడ్ స్పెషల్ మాస్ సాంగ్ ‘హెల్లాళ్ళల్లో’ (#Hellallallo) ఫుల్ వీడియో సాంగ్ నెట్టింట విడుదలై సంచలనం సృష్టిస్తోంది. భోపాల్‌లో జరిగిన గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌లో లైవ్ పర్ఫార్మెన్స్‌తో ఊపేసిన ఈ పాట.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ (AR Rahman) కంపోజ్ చేసిన ఈ సాంగ్ పక్కా లోకల్ జాతర వైబ్స్, అదిరిపోయే ఫోక్ అండ్ మాస్ బీట్స్‌తో డిజైన్ చేయబడింది. ఈ ప్రత్యేక గీతంలో రామ్ చరణ్‌తో కలిసి గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ (Shruti Haasan) స్క్రీన్‌ను షేక్ చేసింది. అనంత శ్రీరామ్ రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్, రక్షిత సురేష్ హై-ఎనర్జీ వాయిస్ ఈ పాటకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి.

‘ఎవడు’ సినిమా తర్వాత చాలా కాలానికి రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు హ్యాపిగా ఉంది. శృతి హాసన్ తన అల్టిమేట్ గ్లామర్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో చరణ్‌కు గట్టి పోటీ ఇచ్చింది. కేవలం ఐటెం సాంగ్‌లా కాకుండా, పల్లెటూరి పండుగ వాతావరణం, కలర్‌ఫుల్ విజువల్స్.. హుక్ స్టెప్స్ ఈ పాటను థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు వేయించేలా డిజైన్ చేశారు. సినిమాలో మెయిన్ లీడ్స్ అయిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ఈ సాంగ్ ఫ్రేమ్‌లో మెరవడం విశేషం. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రాయ్ రాయ్ రా రా’ సాంగ్స్ క్లాస్ అండ్ మెలోడీ హిట్స్ అవ్వగా.. ఈ మూడవ సింగిల్ పక్కా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.