Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అరుదుగా జరిగే విధంగా ‘పెద్ది’ చిత్ర యూనిట్ ఒక సరికొత్త ఆడియో లాంచ్ ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. భోపాల్ వేదికగా నేడు (మే 23) జరగబోయే ఈ మెగా మ్యూజికల్ నైట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనలతో పాటు ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వయంగా హాజరవుతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ అండ్ టీమ్ ఇవ్వబోయే లైవ్ పర్ఫార్మెన్స్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
‘ఎన్టీవీ’ (NTV) అందించిన తాజా అప్డేట్ ప్రకారం.. ఈ ఈవెంట్ కేవలం ఒక సాధారణ ప్రెస్ మీట్‌లా కాకుండా ఒక భారీ మ్యూజికల్ కాన్సెర్ట్లా సాగబోతోంది. ఈ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్.. అతని సింగర్స్ టీమ్ ‘పెద్ది’ సినిమా నుండి ఏకంగా రెండు సరికొత్త పాటలను స్టేజ్‌పై లైవ్‌లో పర్ఫార్మ్ చేయబోతున్నారు. ఇందులో నిన్న ప్రోమోతో దుమ్ములేపిన మాస్ సాంగ్ కూడా ఉండటం విశేషం. కేవలం ‘పెద్ది’ పాటలు మాత్రమే కాకుండా, ఏఆర్ రెహమాన్ తన కెరీర్‌లోని పాత క్లాసిక్ అండ్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాల తాలూకూ పాటలను కూడా ఈ వేదికపై లైవ్‌లో పాడి వినిపించబోతున్నారు.
Also Read
భోపాల్ నగరంలో ఇంత భారీ ఎత్తున తెలుగు సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. అంతే కాదు మధ్యప్రదేశ్ సీఎం కూడా ఈ ఈవెంట్ కి ముఖ్య అథిదిగా వస్తారంటున్నారూ. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, నార్త్ బెల్ట్‌లో కూడా సినిమాకు భారీ హైప్ అండ్ క్రేజ్ తీసుకురావడానికే మేకర్స్ ఈ రేంజ్ ప్లాన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. నేడు జరగబోయే ఈ మ్యూజికల్ కాన్సెర్ట్‌తో ‘పెద్ది’ ఆల్బమ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నేడు గ్రాండ్‌గా జరగనున్న పెద్ది మ్యూజికల్ ఈవెంట్
రామ్ చరణ్ బుచ్చిబాబు సహా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరు
పెద్ది నుంచి రెండు సాంగ్స్ లైవ్ లో పెర్ఫార్మ్ చేయనున్న రెహమాన్ అండ్ టీం
అలాగే రెహమాన్ గత సినిమాలో పాటలు కూడా లైవ్ లో పర్ఫార్మ్ చేసే… pic.twitter.com/7s3nImA2bB
— NTV Breaking News (@NTVJustIn) May 23, 2026
తాజావార్తలు
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!