Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ బుచ్చిబాబు సన, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్‌లతో కలిసి రామ్ చరణ్ ‘పెద్ది’ ఆడియో ప్రమోషన్స్ కోసం భోపాల్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన మ్యూజికల్ నైట్‌లో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. చరణ్ ఎగ్జైట్మెంట్లో బుమ్రాను క్రికెటర్ అనబోయి “ఫుట్‌బాల్ ప్లేయర్” అని సంబోధించారు. దీంతో ఒక్కసారిగా స్టేజ్‌పై ఉన్నవారితో పాటు ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు.
భోపాల్ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘నేను బుమ్రాకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయన మన దేశంలో ఫుట్‌బాల్ ఆటను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు’ అంటూ కామెంట్ చేశారు. వరల్డ్ క్లాస్ క్రికెట్ బౌలర్ అయిన బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ.. “చరణ్‌కు పేర్లు, సందర్భాలు అస్సలు గుర్తుండవు, చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాడు” అని సరదాగా వ్యాఖ్యానించారు. భోపాల్ ఈవెంట్ సాక్షిగా ఎన్టీఆర్ చెప్పిన మాట మరోసారి నిజమైందంటూ నెటిజన్లు, మీమర్స్ చరణ్ వీడియోను వాడుకుంటూ సోషల్ మీడియాలో క్రేజీ మీమ్స్‌తో హల్చల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read
అయితే ఈవెంట్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, తన పొరపాటును గ్రహించిన రామ్ చరణ్.. ఏమాత్రం ఈగోకు పోకుండా అర్ధరాత్రి తన అఫీషియల్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా బుమ్రాకు ఎమోషనల్ సారీ చెప్పారు.. ‘అబ్బా.. కొన్నిసార్లు నాకు పేర్లు, విషయాలు అస్సలు గుర్తుండవు! భోపాల్ ఈవెంట్‌లోని ఆ భారీ జనం, అక్కడి ఎగ్జైట్మెంట్లో కేవలం హ్యూమన్ ఎర్రర్ (పొరపాటు) వల్ల అలా మాట్లాడేశాను. జస్ప్రీత్ బుమ్రా గారు, నన్ను క్షమించండి. యు ఆర్ ఎ లెజెండ్!’ అంటూ చరణ్ ట్వీట్ పెట్టారు. తప్పు దొర్లితే వెనకాడకుండా వెంటనే క్షమాపణలు చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డౌన్-టు-ఎర్త్ నేచర్‌ను చూసి అటు మెగా ఫ్యాన్స్, ఇటు క్రికెట్ లవర్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. జూన్ 4న ‘పెద్ది’ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో ఈ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ సినిమా ప్రమోషన్స్‌కు మరింత హైప్ తెచ్చిపెట్టింది.
Uff… I’m genuinely so forgetful with names sometimes.
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up – it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…
— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!