Rakul Preet Singh: బాలీవుడ్ అందాల భామలలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ ఒక సంవత్సరం పెద్దదైంది. నిన్న తన బర్త్ డే సందర్భంగా.. స్కాట్లాండ్‌లో స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు కేక్‌లను కట్ చేస్తున్నవీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో రకుల్ నలుపు, తెలుపు దుస్తులు ధరించి చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం దేశంలో మరో అప్ కమింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ లో రకుల్ బిజీగా ఉంది. ఆమె పుట్టినరోజు వేడుకల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. అక్కడ ఆమె పెద్ద చాక్లెట్ కేక్‌ను కత్తిరించడం మనం చూడవచ్చు. ఆమె కేక్ ముక్కను హృదయపూర్వకంగా ఆస్వాదించడం చూసి, ఆమె పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది, “What’s a bday without a mouthful of cake.” అంటూ క్యాప్సన్ కూడా ఇచ్చింది రకుల్..
ఆ విషయం పక్కన పెడితే ఈ అమ్మడు తాను ప్రేమలో ఉన్నట్లుగా చాలా నెలల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే.. ఇతర జంటల మాదిరిగా వీరిద్దరు ఫోటోలను షేర్ కూడా చేయడం లేదు. ఆమె ఎంజాయ్ చేస్తూ.. పార్టీలకు తిరుగుతున్న వీడియోలు కూడా బయటకు రావడం లేదు. ఈనేపథ్యంలో.. అసలు వీరిద్దరు కలిసే ఉన్నారా అంటూ వస్తున్న అనుమానాలపై రకుల్ సోదరుడు అమన్ ఇటీవలే బాంబ్ పేల్చాడు. తన సోదరి ప్రేమలో వుందని రకుల్ ,జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని క్లారిటీ ఇవ్వడంతో.. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే తన సోదరుడు చేసిన వ్యాఖ్యలకు రకుల్ సమాధానం ఇచ్చింది. దీంతో.. ఈ విషయమై రకుల్ చేసిన వ్యాఖ్యలు గందరగోళంను క్రియేట్ చేస్తోంది.

సోదరుని ట్వీట్ కు రకుల్ స్పందిస్తూ.. నా పెళ్లి గురించి నువ్వు నిజంగా స్పష్టతను ఇచ్చావా.? నా పెళ్లి గురించి నాకు కూడా కాస్త క్లారిటీ ఇవ్వాలి కదా? బ్రో ..! నా జీవితం గురించి నాకే తెలియకుండా పోయింది..! అంటూ రకుల్ అసహనం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడుతూ ఏడుస్తున్న ఐమోజీని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ ఇంకాస్తా వైరల్ అవుతోంది. సోదరునిపై ఘాటుగా స్పందించిందంటూ ట్వీటర్ వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిజమేకదా ఎంత సోదరి అయితే మాత్రం పెళ్లి గురించి రకుల్ కాకుండా బ్రదర్ చెప్పడమేంటని కామెంట్లు గుప్పుమంటున్నాయి. ఈ వార్తతో జాకీ భగ్నానీ తో ఈమె ప్రేమలో ఉందా? పెళ్లి చేసుకుంటారా? అనే అనుమానాలు మళ్లీ హాట్‌టాపిక్ గా మారాయి.
😂 @AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it’s funny how I don’t have news about my life .. https://t.co/ZSZgNjW2BW
— Rakul Singh (@Rakulpreet) October 12, 2022