రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి రూపొందిస్తున్న ఈ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు ‘రక్షక్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మంచు మనోజ్ శక్తిమంతమైన లుక్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పోస్టర్‌పై కనిపించే “The hidden truth is never hidden forever (దాచిన నిజం ఎప్పటికీ దాగి ఉండదు)” అనే ట్యాగ్‌లైన్ కథలోని రహస్యాన్ని సూచిస్తూ ఉత్కంఠను పెంచుతుంది.
Also Read: Arya 3: బన్నీ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఆర్య-3’ టైటిల్ రిజిస్టర్ చేసిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్న మంచు మనోజ్, ప్రస్తుతం ‘భైరవం’, ‘మిరాయ్’ చిత్రాల్లో శక్తివంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ‘రక్షక్’తో మరోసారి హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఆయన తీవ్రమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామా ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందించనుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.