Raju weds Rambai: అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “రాజు వెడ్స్ రాంబాయి” ప్రేక్షకుల ఆదరణ చూరగొని ఘన విజయాన్ని సాధించింది. ఒక హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథా చిత్రంగా విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
Read Also: Ram – Bhagya Sri: రామ్ తో ప్రేమ.. ఓపెనైన భాగ్య శ్రీ
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో రూ. 7.28 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. విశేషం ఏమిటంటే, ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు మరింత మెరుగైన వసూళ్లు ఈ సినిమాకు లభించడం సక్సెస్ స్థాయిని తెలియజేస్తుంది.
Read Also: Oasis Oasis Fertility: ఓయాసిస్ ఫెర్టిలిటీ- విశాఖపట్నం నుంచి ‘జనని యాత్ర’ ప్రారంభం
నిర్మాణ వివరాలు:
డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్ మరియు మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని అట్టహాసంగా థియేటర్లలో విడుదల చేశారు.ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.