వైవిధ్యమైన కంటెంట్‌కి పెట్టింది పేరు ZEE5. భారతదేశపు టాప్ OTT ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన జీ5, మళ్లీ మరోసారి ఓ పవర్‌ఫుల్ సినిమాతో దూసుకెళ్తోంది. మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ‘భైరవం’ సినిమా ఇప్పుడు OTTలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జూలై 18న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి ఊహించని విజయాన్ని అందుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంది శంకర్, దివ్యా పిళ్లై కీలక పాత్రల్లో మెప్పించారు.
కథ విషయానికొస్తే.. ఒక పల్లెటూరి నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల జీవితం ఎలా మలుపు తిరిగిందన్నదే ప్రధానంగా ఉంటుంది. గ్రామంలోని ఆలయ భూములపై కన్నేసిన ఒక రాజకీయ నాయకుడి కుతంత్రాలు, ఆ ముగ్గురి స్నేహం, ప్రేమ, త్యాగంతో కూడిన జీవనయానం ఈ చిత్రాన్ని హృదయాన్ని తాకేలా చేస్తుంది. ఈ విజువల్ ఎంటర్టైనర్‌కు హరి కె వేదాంతం సినిమాటోగ్రఫర్‌గా, శ్రీ చరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ZEE5లో జూలై 18న స్ట్రీమింగ్ ప్రారంభమైన ‘భైరవం’ సినిమా ఇప్పటికే పెద్ద విజయం సాధించడంతో, మీరు ఇంకా చూడలేదు అంటే తప్పకుండా చూసేయాలి!