Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Rajinikanths Coolie Advance Bookings Locked Grand Usa Release From July 24

Coolie : ‘కూలీ’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ లాక్..!

Published Date :July 11, 2025 , 7:42 am
By Mounika
Coolie : ‘కూలీ’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ లాక్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ మాస్ మోడ్‌లోకి రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా టాప్ ట్రెండింగ్ మూవీలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడని ప్రకటించిన నాటి నుంచే అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాజిటివ్ హైప్ ఉంది. ముఖ్యంగా రజినీ అభిమానులు తమ అభిమాన నటుడిని మళ్లీ యాక్షన్ గెటప్‌లో చూడబోతున్నారని తెగ ఉత్సాహపడుతున్నారు. ఇక రజినీకాంత్ తో పాటు ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ వంటి టాప్ స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో మల్టీ స్టారర్ మేజిక్ వర్క్ అవుతుందనే నమ్మకం తో మేకర్స్ ఉన్నారు.

Also Read : Chiranjeevi : ‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌ ఔట్‌పుట్‌పై మెగాస్టార్‌ చిరంజీవి కామెంట్స్ వైరల్..

సినిమాకు యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సింగిల్స్, బిజెఎంలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం, అమెరికాలో ‘కూలీ’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అక్కడ రజినీకాంత్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ స్క్రీన్ కౌంట్‌తో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ మాస్ యాక్షన్ బ్లాస్టర్‌ను మేకర్స్ ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇండిపెండెన్స్ డే (ఆగస్టు 15) సమయం కావడంతో ఓపెనింగ్స్ పరంగా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Coolie Cast and Crew
  • Coolie First Day First Show
  • Coolie Movie Update
  • Coolie Songs Anirudh
  • Coolie USA Release

తాజావార్తలు

  • PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

  • Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!

  • Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions