Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజనీకాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ మూవీ ‘జైలర్ 2’. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఫిల్మ్ నగర్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు షూట్ చేసిన కొన్ని సీన్లు ఆశించిన స్థాయిలో రాలేదని చిత్రబృందం భావిస్తోందట. దీంతో ఎడిటింగ్ టేబుల్ వద్దే కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
దీనికి ఇంకా దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇతర నటీనటుల క్యామియో రోల్స్‌కు సంబంధించిన డేట్స్, స్క్రీన్‌ప్లే సర్దుబాట్ల వల్ల కొంత గందరగోళం ఏర్పడిందని, అందుకే ఇంత ఆలస్యం జరుగుతోందని ఇండస్ట్రీ టాక్. ఇక పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, సీక్వెల్ విషయంలో ఎక్కడా తగ్గకూడదని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే నాణ్యత కోసం ఎంత సమయమైనా తీసుకోవాలని టీమ్ ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతానికి అభిమానులు ఈ వార్త విని కొంత నిరాశ చెందుతున్నా, రజనీకాంత్‌ను మరోసారి పవర్ఫుల్ యాక్షన్ రోల్లో చూడటానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?