Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni in Rajinikanth’s Dharman Movie: ‘సూపర్ స్టార్’ రజినీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’పై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్మన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని కూడా భాగం అయ్యారు. రాశి ఖన్నా తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోతో ధర్మన్‌లో రామ్ నటిస్తున్నారని ఖాయం అయింది. ఇప్పటివరకు ప్రచారానికే పరిమితమైన రూమర్స్ ఇప్పుడు నిజమని తేలిపోయింది.
ధర్మన్‌లో రామ్ పోతినేని విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. రామ్ పోషించబోయే పాత్ర విలన్ ఛాయలతో ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రతినాయకుడిగా ఉండదని టాక్. ఈ సినిమాలో రాశి ఖన్నా సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తెగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రేమికుడిగా రామ్ నటిస్తున్నట్లు టాక్. దీంతో రజినీకాంత్, రామ్, రాశి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. రామ్ ఇంతకుముందు హీరోగా చేసిన సినిమాలతో పోలిస్తే.. ధర్మన్‌లో ఆయన పాత్ర భిన్నంగా ఉండనుండటంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగింది.
Also Read
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
- Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సిమ్రాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రేమ, కుటుంబ అంశాలతో పాటు రజినీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా వినోదం, యాక్షన్ అంశాలను మేళవిస్తూ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మన్ను సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ధర్మన్ మూవీ మైసూర్ లొకేషన్లలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!