Site icon NTV Telugu

Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా.. కోట్లు కొల్లగొడుతున్నాడు!

Coolie Movie,superstar Rajinikanth,

Coolie Movie,superstar Rajinikanth,

జైలర్ సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన Non థియేటర్ రైట్స్ భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. లోకేష్ కనకరాజ్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఉంటుంది, దానికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ కూడా తోడవడంతో ఈ సినిమాకి సంబంధించిన థియేటర్ రైట్స్‌కు కూడా మంచి డిమాండ్ ఉంది.

Also Read:Raja Singh: “వాళ్లను గుడిలోకి రానివ్వొద్దు”.. బోనాల నిర్వహకులకు రాజాసింగ్ కీలక సూచనలు..

తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ అమ్మకం జరిగింది. ఏకంగా దానికి 81 కోట్లు లభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఓవర్సీస్‌లో అన్ని భాషలకు రైట్స్ అమ్ముడుపోగా, తెలుగు, తమిళ భాషలకు మాత్రం భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:Kubera: సెన్సార్ రిపోర్ట్.. ఏకంగా 19 కట్స్.. 13 నిమిషాలు ఔట్!

ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా రాసుకున్న కథతో తెరకెక్కించబడింది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబ మౌనిక జాన్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతంతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు. సినిమాకి ఈ రేంజ్ బజ్ రావడానికి అనిరుద్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.

Exit mobile version