‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమాను.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్‌ని విడుదల చేయగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
Also Read : Big News : ఒక రోజు ముందుగా అఖండ 2.. స్పెషల్ ప్రీమియర్స్
రెబల్ సాబ్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను నవంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ పోస్టర్ వదిలారు మేకర్స్. ఈ పోస్టర్ చాలా కలర్ ఫుల్‌గా ఉండగా.. వింటేజ్ లుక్‌లో డార్లింగ్ కేక పెట్టించేలా, అదిరిపోయే స్టెప్ వేస్తు కనిపిస్తున్నాడు. దీంతో.. రెబల్ ఫాన్స్ ఆనందపడిపోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నాడు. ఇటీవల తమన్ వరుస హిట్స్ కొడుతుండడంతో రాజాసాబ్ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇక్కడి నుంచి రాజాసాబ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పది రోజులకొక సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రెండో పాట రిలీజ్ కానుండగా.. థర్డ్, ఫోర్త్ సింగిల్ కూడా అదే నెలలో రిలీజ్ చేయనున్నారు. అలాగే.. న్యూ ఇయర్ గిఫ్ట్‌గా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా.. ఇప్పటి నుంచి రాజాసాబ్ రచ్చ మామూలుగా ఉండదనే చెప్పాలి.