ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌తో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రేలర్ అలాగే ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Also Read : BhaBhaBa : అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేసిన బిగ్గేస్ట్ మల్టీస్టారర్
ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ ను హైదరాబాద్ లోని లులు మాల్ లో రిలీజ్ చేశారు. సహన సహన అని సాగిన ఈ సాంగ్ లో ట్యూన్ ..డ్రెస్ సెన్స్..లోకేషన్లు చాలా బాగున్నాయి. ఇక ప్రభాస్ స్టెప్స్ విషయంలో కొరియోగ్రాఫర్ మంచి కేర్ తీసుకుని చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాని జనవరి 8న ప్రిమియర్స్ తో రిలీజ్ చేస్తున్నామని విశ్వప్రసాద్ ప్రకటించారు. అయితే ప్రీమియర్స్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రెండు తెలుగు స్టేట్స్ లో భారీ ఎత్తున భారీ స్థాయిలో ప్రీమియర్స్ కు పప్లానింగ్ జరుగుతోంది. అలాగే ఏపీలో ఈ సినిమాకు అదనపు రేట్లు ఉండే ఛాన్స్ ఉంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావండతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక రాజాసాబ్ నుండి మరొక ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు మేకర్స్.