యంగ్ హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’ నుంచి మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా రాజ్ తరుణ్ కెరీర్‌లో ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా రాబోతుండటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర బృందం హీరోకు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలియజేసింది. అయితే ఈ సినిమా కథాంశం వింటే ఎవరైనా థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే. ‘టార్టాయిస్’లో రాజ్ తరుణ్ పాత్రకు నిద్రలో నడిచే అలవాటు (స్లీప్ వాకింగ్ – సోమ్నాంబులిజం) ఉంటుంది. అలా నిద్రలో నడుచుకుంటూ వెళ్లి హీరో కొన్ని హత్యలు చేస్తాడు. అసలు అతనికి తెలియకుండానే ఆ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఉత్కంఠభరితమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సరికొత్త స్క్రీన్‌ప్లేతో రాబోతున్న ఈ థ్రిల్లర్ కచ్చితంగా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ రిత్విక్ కుమార్ చెబుతున్నారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అమృత చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలెంటెడ్ యాక్టర్స్ శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ చాలా బలమైన, కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.కె. గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్.వి.ఎల్ క్రియేషన్స్ మరియు మధుపాల మహా మూవీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. “ఈ డిఫరెంట్ థ్రిల్లర్ రాజ్ తరుణ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొస్తాం” అని వెల్లడించారు. హిట్ చిత్రాల సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
