క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించిన “అఖండ”

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులోని లొకేషన్ లో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళనాడులోని ఒక ఆలయంలో షూటింగ్ జరుగుతోంది. ప్రధాన నటుడితో పాటు మిగతా నటీనటులు కూడా సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. సమాచారం ప్రకారం స్టంట్ కొరియోగ్రాఫర్ శివ ఒక యాక్షన్ సీక్వెన్స్ కొరియోగ్రాఫ్ చేసాడు. ఇది “అఖండ” చిత్రానికి ప్రధాన హైలైట్ అని అంటున్నారు.

Read Also : “రాధే శ్యామ్” రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన పూజాహెగ్డే

కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్న “అఖండ”ను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో బాలయ్య అఘోరాగా కన్పించడంతో సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. “అఖండ”కు తమన్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

-Advertisement-క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించిన "అఖండ"

Related Articles

Latest Articles