బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ అకాల మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, నటుడు రాహుల్ దేవ్ తన బాధను వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాహుల్… ముకుల్ మృతి పై వస్తున్న తప్పుడు వార్తలను ఖండించారు.
Also Read : Puri Jagannadh : పూరి-సేతుపతి మూవీలో మరో హీరోయిన్..!
‘ముకుల్ డిప్రెషన్ కారణంగా చనిపోయాడని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అది పూర్తిగా అబద్దం. ఆయన చివరి రోజులలో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్లే ఆరోగ్యం క్షీణించింది. ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందాడు. ఆసుపత్రిలో చేరిన తర్వాత తినడం పూర్తిగా మానేశాడు. డాక్టర్స్ కూడా ఇదే స్పష్టంగా చెప్పారు’ అని రాహుల్ తెలిపారు. అలాగే ముకుల్ జీవితాన్ని ప్రభావితం చేసిన కొన్ని సంఘటనలను రాహుల్ గుర్తుచేశారు ‘2019లో మా నాన్న మరణం ముకుల్‌పై తీవ్ర ప్రభావం చూపింది. తర్వాత తల్లి మృతి, భార్యతో విడాకులు.. ఆ తరువాత ముకుల్ ఎక్కువగా ఒంటరిగా ఉండేవాడు. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. దురదృష్టవశాత్తూ, ఆయనను పట్టించుకునే వారు ఎవ్వరూ లేరు’ అన్నారు రాహుల్ దేవ్.
ముకుల్ ఆరోగ్యం గురించి ఈరోజు విమర్శలు చేస్తున్నవారిని కూడా రాహుల్ ప్రశ్నించారు.. ‘ఆయన పరుగెత్తగలిగే స్థితిలో ఉన్నవాడు. అతడిపై ఆరోపణలు చేయడంలో అర్థం లేదు. అతడు బతికినప్పుడు ఆసుపత్రికి వెళ్లి కనీసం పరామర్శ చేసినవారు ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఎమోషనల్‌గా ప్రశ్నించారు.