Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhika Apte: ఎలాంటి విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే సినీ ఇండస్ట్రీలోని చేదు నిజాలను మరోసారి బయటపెట్టింది. గతంలో తను చేసిన ఓ యాక్షన్ సినిమా షూటింగ్లో ఎదురైన దారుణమైన పరిస్థితి గురించి చెప్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
గతంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు లోదుస్తుల్లోనే స్టంట్స్ చేయాలంటూ మేకర్స్ తనను ఇబ్బంది పెట్టారని రాధిక వెల్లడించింది. “షూటింగ్ మొదలయ్యాక నన్ను లోపల బ్రా లేకుండా కేవలం షర్ట్ మాత్రమే వేసుకుని, బటన్లు విప్పేసి యాక్షన్ సీన్ చేయగలరా అని అడిగారు. అసలు ఫిజిక్స్ పరంగా అది సాధ్యమేనా అని నేను అడిగాను. ఏదైనా ఉంటే ముందే చెప్పాలి కానీ, తీరా సెట్లోకి వచ్చాక ఆ సీన్‌కు రెండు రోజుల ముందు బేరసారాలు ఆడటం నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ పార్ట్ చూపిస్తారా, ఈ పార్ట్ చూపిస్తారా అంటూ రెండు వారాల పాటు నన్ను విపరీతంగా టార్చర్ చేశారు” అంటూ ఆమె ఎమోషనల్ అయింది.
Also Read
బోల్డ్ సీన్లు చేసేటప్పుడు నటీనటులకు రక్షణగా ఉండే ఇంటిమసీ కోఆర్డినేటర్లు కూడా నిర్మాతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారని ఆమె చెప్పింది. ఎవరైనా హీరోయిన్ల తరఫున మాట్లాడితే వాళ్లను ఏకంగా ఉద్యోగాల్లోంచే తీసేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఇండస్ట్రీలో అందరూ ఇలా ఉండరని, పది మందిలో ఒకరిద్దరు చేసే ఇలాంటి పనుల వల్లే సమస్యలు వస్తున్నాయని.. ఆ చేదు అనుభవం ఇచ్చిన సినిమా పేరును మాత్రం ఇప్పటికీ తాను బయటపెట్టలేకపోతున్నానని రాధిక చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
-
Miyapur Land Dispute : మియాపూర్ భూములపై సుప్రీం కీలక తీర్పు.. ప్రభుత్వానికి భారీ ఊరట
-
Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
-
AP Intermediate: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.. పరీక్షల ఫీజు గడువు పెంపు..
-
Women’s Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?